Autobiography of albert einstein in telugu
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14న జన్మించాడు. 1955 ఏప్రిల్ 18న మరణించాడు.
అల్బర్ట్ ఐన్‌స్టీన్ ముఖ్య ప్రవచనాలు
[మార్చు]- మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.
- మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.
- ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.
- రోజువారీ ఆలోచనల మేలిమి రూపమే శాస్త్రం.
- ఉన్న జ్ఞానానికన్నా ఊహ గొప్పది.
- వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు.
కానీ విగ్రహంగా మార్చకు. (పూజించకు)
- నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.
- ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.
- రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.
- సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.
- విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.
- మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
- నా జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను.
కాని నా అంతరాలలోని 'నేను' అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.
- జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతునే ఉండాలి.
- బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది.
- చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు.
- తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం.
ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.
- ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.
- జ్ఞానికన్నా ఊహ గొప్పది.
- నాకు గణితం మీద నమ్మకం లేదు.
- జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.
- తెలివి,శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.
- స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.
- నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా స్వీకరించాను.
- భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.
- ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని మనిషి ఆత్మలోని పాపాన్ని మాత్రం మార్చలేము.
- ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం.
అంతటి లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.
- నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు.
- అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి ఎక్కువ హానికరం,అగౌరవం.
- శాస్త్ర విజ్ఞానమంతా ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.
- దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు.
- గొప్ప వ్యక్తులకు సాధారణ వ్యక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత సహజం.
- ప్రకృతికి దగ్గరగా ఉంటే ...జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి.
సంతోషమయమైన జీవితం గడపాలంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలే కాని మనుషులను, వస్తువులను లక్ష్యంగా పెట్టుకోకూడదు.
- మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది.
- మనం ఎంచేస్తున్నామో మనకి తెలిస్తే అది పరిశోధన కాదు. అవుతుందా?
- ఒక రాజ్యాంగం అసలైన శక్తి దేనిలో దాగి ఉందో తెలుసా ...? ఆ రాజ్యాంగం కాపాడుకోవాలనుకున్న పౌరుల సంకల్ప బలం లోనే ...!
దాని పరిరక్షణను ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావిస్తేనే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు పదిలంగా ఉంటాయి. [1]
మూలాలు
[మార్చు][2]